షార్ట్‌కట్ అని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి, యువతి పట్ల రాపిడో బైకర్ వికృత చేష్టలు
December 17, 2025

ముంబైలోని కళ్యాణ్ ప్రాంతంలో జిమ్‌కు వెళ్తున్న 26 ఏళ్ల యువతిపై రాపిడో బైక్ రైడర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. బైక్ బుక్ చేసుకున్న యువతిని గమ్యస్థానానికి తీసుకెళ్లకుండా, 19 ఏళ్ల సిద్ధేష్ అనే రైడర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, యువతి పర్సు నుంచి వెయ్యి రూపాయలను బలవంతంగా లాక్కున్నాడు.
బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 12వ తరగతి మధ్యలోనే ఆపేసిన సిద్ధేష్‌ను కోర్టు డిసెంబర్ 18 వరకు పోలీసు కస్టడీకి పంపింది. యాప్ ఆధారిత ప్రయాణాల్లో మహిళా భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది.