షాకింగ్: బలవంతంగా ముద్దు పెట్టబోయిన మాజీ ప్రియుడి నాలుకను కొరికిన యువతి!
November 24, 2025

ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో షాకింగ్ ఘటన జరిగింది. వివాహం నిశ్చయమవడంతో దూరమైన మాజీ ప్రియుడు బలవంతంగా ముద్దుపెట్టేందుకు ప్రయత్నించగా, ఆ యువతి కోపంతో అతని నాలుకను కొరికి వేసింది. బిల్హౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొలంలో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం హాలెట్ ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు యువకుడిపై ఐపీసీ సెక్షన్లు 323, 504, 506, మరియు 354 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, గాయపడిన యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం పాత కక్షల కారణంగా యువతి సోదరులే కత్తితో తమ కొడుకు నాలుకను కోసేశారని ఆరోపిస్తున్నారు. ఇరుపక్షాల నుండి అందిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.