శ్రీలంకతో నాలుగో టీ20కి ముందు భారత్ కు షాక్ స్టార్ ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్ దూరం

శ్రీలంకతో నాలుగో టీ20కి ముందు భారత్ కు షాక్ స్టార్ ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్ దూరం

శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత మహిళల జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో నాలుగో టీ20 మ్యాచ్‌కు దూరమయ్యారు. ఆదివారం తిరువనంతపురంలో జరిగిన టాస్ సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ విషయాన్ని వెల్లడించారు. జెమిమా స్వల్ప జ్వరం మరియు బలహీనతతో బాధపడుతున్నారని, అందుకే ఆమెకు విశ్రాంతినిచ్చినట్లు బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది.

జెమిమా స్థానంలో దాదాపు రెండు నెలల తర్వాత హర్లీన్ డియోల్ తుది జట్టులోకి వచ్చారు. ప్రస్తుత సిరీస్‌లో జెమిమా మూడు మ్యాచ్‌ల్లో 104 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. జెమిమాతో పాటు యువ పేసర్ క్రాంతి గౌడ్‌కు కూడా ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చి, సీనియర్ పేసర్ అరుంధతి రెడ్డిని జట్టులోకి తీసుకున్నారు. ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన తర్వాత భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న వేళ జెమిమా దూరం కావడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *