శవానికి ప్రాణం పోసింది ఆ నీరు, శ్మశానంలోనే బ్రతికిన యువకుడు.. 15 నిమిషాల్లో మళ్ళీ విషాదం
September 20, 2025

వారణాసిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించిన 21 ఏళ్ల యువకుడు, అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్లినప్పుడు అద్భుతంగా ప్రాణం పోసుకున్నాడు. గంగా నదిలో స్నానం చేయిస్తున్నప్పుడు అతని శరీరంలో కదలికలు కనిపించడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు.
వెంటనే అతడిని తిరిగి ఆసుపత్రికి తరలించారు. అయితే కేవలం 15 నిమిషాల్లోనే వైద్యులు అతడిని మళ్లీ మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనతో యువకుడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.