వైరల్ వీడియోలో ‘నీటిపై నడిచిన దేవత’; నిజం తెలిస్తే షాక్ అవుతారు
September 18, 2025

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నర్మదా నది నీటిపై ఒక వృద్ధురాలు నడుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇది అద్భుతం అని నమ్మిన వేలాది మంది ప్రజలు ఆమెను ‘నీటిపై నడిచిన దేవత’గా భావించి పూజించారు, ఆశీర్వాదం కోసం ఆమెను చూసేందుకు గుమిగూడారు.
అయితే, ఈ సంఘటన వెనుక ఉన్న నిజం చివరికి బయటపడింది. అది అద్భుతం కాదని ఆ వృద్ధురాలు స్వయంగా స్పష్టం చేశారు. ఆమె నడిచిన చోట నీరు చాలా తక్కువగా, మోకాళ్ల లోతుకు కూడా లేదని చెప్పారు. ఇది ఆమె సాధారణ యాత్రలో ఒక భాగమని వివరించారు. ఈ నిజం వెలువడటంతో, భక్తులు నిరాశకు గురయ్యారు.