వైజాగ్‌లో లక్ష కోట్ల పెట్టుబడి! భారత్‌కే ‘డేటా రాజధాని’గా విశాఖ

విశాఖపట్నం (వైజాగ్)లో రిలయన్స్-జేవీ డిజిటల్ కనెక్షన్ సంస్థ దాదాపు ₹98,000 కోట్ల (11 బిలియన్ అమెరికన్ డాలర్లు) పెట్టుబడితో 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుందని ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. గూగుల్-అదానీ గ్రూప్ ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి తర్వాత దేశంలో ఇది రెండవ అతిపెద్ద పెట్టుబడి. ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా వైజాగ్ త్వరలోనే భారతదేశానికి ‘డేటా రాజధానిగా’ మారుతుందని మంత్రి పేర్కొన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్‌ఫీల్డ్ సంస్థల జాయింట్ వెంచర్ అయిన జేవీ డిజిటల్ కనెక్షన్, ఏపీ ఆర్థికాభివృద్ధి సంస్థ (APEDB)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ వచ్చే ఐదేళ్లలో 400 ఎకరాల విస్తీర్ణంలో డేటా సెంటర్‌ను అభివృద్ధి చేయనుంది. ఈ హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌లు ముఖ్యంగా ఏఐ (AI) వర్క్‌లోడ్‌లు, ఎంటర్‌ప్రైజ్‌లకు నిరంతరాయంగా సేవలను అందించడానికి రూపొందించబడ్డాయని, తద్వారా రాబోయే దశాబ్దపు ఆవిష్కరణలకు శక్తినిస్తాయని కంపెనీ తెలిపింది.