విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు కొట్టడం నేరం కాదు, కేరళ హైకోర్టు సంచలన తీర్పు

విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు కొట్టడం నేరం కాదు, కేరళ హైకోర్టు సంచలన తీర్పు

పాఠశాలల్లో విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచేందుకు ఉపాధ్యాయులు స్వల్పంగా బెత్తం వాడటం నేరం కాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థుల ప్రవర్తనను సరిదిద్దే ఉద్దేశంతో ఉపాధ్యాయులు చేసే ఇటువంటి పనులను క్రూరత్వంగా పరిగణించలేమని న్యాయస్థానం పేర్కొంది. తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం చదువు కోసమే కాకుండా, క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దేందుకే పాఠశాలలకు పంపిస్తారని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది.

ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు ఎటువంటి దురుద్దేశం లేకుండా, కేవలం విద్యార్థి శ్రేయస్సు కోసమే శిక్షించినట్లయితే అది చట్టప్రకారం నేరం కాదని వివరించారు. విద్యార్థులను మంచి మార్గంలో నడిపించడానికి అవసరమైనప్పుడు చేసే ఇటువంటి చర్యలను ఉపాధ్యాయుని బాధ్యతలో భాగంగానే చూడాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పు విద్యావ్యవస్థలో క్రమశిక్షణ మరియు ఉపాధ్యాయుల పాత్రపై కొత్త చర్చకు దారితీసింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *