విడాకుల తర్వాత డేటింగ్‌కు ఆహ్వానం, ట్రంప్‌పై బ్రిటీష్ నటి సంచలన ఆరోపణ
August 12, 2025

1998లో తన విడాకుల తర్వాత, అప్పటి అమెరికా వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్ తనను డేటింగ్‌కు ఆహ్వానించారని బ్రిటీష్ నటి ఎమ్మా థాంప్సన్ సంచలన ఆరోపణ చేశారు. ఇటీవల స్విట్జర్లాండ్‌లో జరిగిన లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ ఆస్కార్ విజేత నటి ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రంప్ తనను ‘స్టాక్’ చేశారని, విడాకుల వార్త తెలిసిన వెంటనే ఈ ప్రతిపాదన చేశారని ఆమె తెలిపారు.
ట్రంప్ తనకు ఫోన్ చేసి, తన ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానించారని, అయితే తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని ఎమ్మా చెప్పారు. ట్రంప్‌తో డేటింగ్‌కు వెళ్లినట్లయితే, అమెరికా చరిత్రను మార్చి ఉండేదాన్నని, తన దగ్గర ఒక మంచి కథ ఉండేదని ఆమె చమత్కరించారు. 1998లో ట్రంప్ కూడా తన రెండవ భార్య మార్లా మేపుల్స్‌కు విడాకులు ఇవ్వడం జరిగింది.