రోహిత్, విరాట్ జీతాల్లో భారీ కోత, బీసీసీఐ కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకటన

రోహిత్, విరాట్ జీతాల్లో భారీ కోత, బీసీసీఐ కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకటన

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమ్ ఇండియా ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్ విధానంలో కీలక మార్పులు చేసింది. గతంలో ఉన్న ఏ+ (A+) గ్రేడ్‌ను పూర్తిగా రద్దు చేసిన బోర్డు, ఆటగాళ్లను మూడు విభాగాల్లోకి చేర్చింది. కొత్త నిబంధనల ప్రకారం, గ్రేడ్-ఏ లోని ఆటగాళ్లకు ఏడాదికి 5 కోట్ల రూపాయలు, గ్రేడ్-బి ఆటగాళ్లకు 3 కోట్ల రూపాయలు, గ్రేడ్-సీ లోని ఆటగాళ్లకు 1 కోటి రూపాయల వేతనం లభిస్తుంది. ఈ వార్షిక వేతనంతో పాటు ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు అదనంగా అందుతాయని బోర్డు స్పష్టం చేసింది.

అయితే తాజా కాంట్రాక్టులో స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు గ్రేడ్-బి కేటాయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనివల్ల వారు ఏడాదికి 3 కోట్ల రూపాయల వేతనాన్ని అందుకోనున్నారు. గ్రేడ్ల వర్గీకరణలో జరిగిన ఈ మార్పులు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత ప్రదర్శనలను ప్రామాణికంగా తీసుకుని బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల క్రమశిక్షణ, నిలకడైన ప్రదర్శనే లక్ష్యంగా బీసీసీఐ ఈ కొత్త ఒప్పందాలను ఖరారు చేసింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *