రైలు ప్రయాణంలో ప్రియుడితో పెళ్లి చేసుకున్న వివాహిత
December 31, 2025

బీహార్‌లోని సుల్తాన్‌గంజ్‌కు చెందిన ఒక యువతికి ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులు రెండు నెలల క్రితం పెళ్లి చేశారు. అయితే తన పాత ప్రేమికుడిని మరువలేక, బుధవారం మార్కెట్‌కు వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఆమె ఇంటి నుండి బయటకు వచ్చేసింది. అనంతరం తన ప్రియుడితో కలిసి రైలు ఎక్కిన ఆమె, ప్రయాణికుల సాక్షిగా రైలులోనే రెండోసారి పెళ్లి చేసుకుంది.
ఈ వినూత్న వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సదరు యువతి తన పాత సింధూరాన్ని తుడిచేసి, ప్రియుడి చేత మళ్ళీ బొట్టు పెట్టించుకుంది. వీరిద్దరూ ఊరు విడిచి వెళ్ళిపోగా, ఈ వింత పెళ్లి ఇప్పుడు గ్రామంలో హాట్ టాపిక్‌గా మారింది.