రేవంత్ ఖాన్ అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఘాటు కౌంటర్

రేవంత్ ఖాన్ అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఘాటు కౌంటర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను ‘కిషన్ రావు’ అని సంబోధించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన పేరు మార్చే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. మీరు మిమ్మల్ని ‘రేవంత్ ఖాన్’ అని గర్వంగా పిలుచుకున్నా మాకు అభ్యంతరం లేదని, మీరు పేరు మార్చుకున్నా లేదా మతం మార్చుకున్నా తమకు అనవసరమని ఆయన ఎద్దేవా చేశారు.

మజ్లిస్ పార్టీతో కలిసి ఉన్నంత కాలం రాజకీయంగా ఎదుర్కొంటామని కిషన్ రెడ్డి హెచ్చరించారు. గతంలో కేసీఆర్ తనను దత్తపుత్రుడని విమర్శించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తాను ఎవరికీ దత్తపుత్రుడిని కాదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తిగత విమర్శలు ప్రజాస్వామ్యానికి తగవని, రాజకీయ పోరాటాన్ని సిద్ధాంతపరంగా చేయాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *