రాజస్థాన్ ఆలయ వింత కుండలో నీరు నిండదు పాలు పోస్తే జరిగే అద్భుతం చూడండి
November 15, 2025

రాజస్థాన్‌లోని జైపూర్, పాలి జిల్లాలో ఉన్న సుమారు 800 సంవత్సరాల పురాతన శీతలా మాత ఆలయం అనేక రహస్యాలకు ప్రసిద్ధి. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన భూగర్భ కుండ ఉంది, దీనిని సంవత్సరానికి కేవలం రెండుసార్లు మాత్రమే తెరుస్తారు. స్థానిక కథనాల ప్రకారం, ఈ కుండలో ఎంత నీరు పోసినా అది నిండదు. దీనికి కారణం, ఆ నీటిని రాక్షసులు తాగుతారని స్థానికులు నమ్ముతారు.
అయితే, శీతలా అష్టమి రోజున అద్భుతం జరుగుతుంది. అమ్మవారి పాదాల దగ్గర ఉంచి, ఈ కుండలో పాలు పోయగానే అది పూర్తిగా నిండిపోతుంది. ఈ అంతుచిక్కని విషయంపై అనేక పరిశోధనలు జరిగినా, దీని వెనుక ఉన్న రహస్యం ఇంకా మిస్టరీగానే ఉంది. ఈ రెండు ప్రత్యేక సందర్భాలలో, కుండపై ఉన్న రాయిని తొలగించి, పాలు సమర్పించినప్పుడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.