రన్నింగ్ ట్రైన్‌లో డబ్బుల వర్షం! నోట్లను ఏరుకునేందుకు జనం పోటెత్తారు

రన్నింగ్ ట్రైన్‌లో డబ్బుల వర్షం! నోట్లను ఏరుకునేందుకు జనం పోటెత్తారు

ఉత్తరప్రదేశ్‌లోని బరేలి దగ్గర, రన్నింగ్ ట్రైన్ నుండి అకస్మాత్తుగా ₹500, ₹100 నోట్లు కింద పడటం కలకలం రేపింది. ఫరీద్‌పూర్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో, ప్రజలు తమ ఫోన్‌లు, టార్చ్‌లైట్ల సహాయంతో రైలు పట్టాలపై నోట్లను ఏరుకునేందుకు గుమిగూడారు. ఈ దృశ్యం సినిమా సన్నివేశాన్ని తలపించింది.

రైలులో ఉన్న ఓ వ్యక్తి డబ్బుల సంచీని కిటికీలోంచి బయటకు విసిరినట్లు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పడిన నోట్లు నిజమైనవా లేదా నకిలీవా అనేది ఇంకా ధృవీకరించబడలేదు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *