మెస్సీతో ఒక్క ఫోటోకు రూ. 10 లక్షలు! ‘GOAT టూర్’లో 100 మంది ఫ్యాన్స్‌కు మాత్రమే ఛాన్స్

మెస్సీతో ఒక్క ఫోటోకు రూ. 10 లక్షలు! ‘GOAT టూర్’లో 100 మంది ఫ్యాన్స్‌కు మాత్రమే ఛాన్స్

ఫుట్‌బాల్ దేవుడు లియోనెల్ మెస్సీ ఎట్టకేలకు భారత గడ్డపై అడుగుపెట్టనున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది GOAT టూర్’ డిసెంబర్ 13న ప్రారంభమవుతుంది. ఈ టూర్‌లో ఆయన కోల్‌కతా, హైదరాబాద్, ముంబై మరియు న్యూ ఢిల్లీ—దేశంలోని నాలుగు ప్రధాన నగరాలను సందర్శిస్తారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆయన పాల్గొననున్నారు. ఈ మ్యాచ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆడనున్నారు.

భారతీయ అభిమానులకు ఇది కల నెరవేరే క్షణం. నిర్వాహకులు ‘మీట్ అండ్ గ్రీట్’ సెషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో కేవలం 100 మంది అదృష్టవంతులైన అభిమానులకు మాత్రమే మెస్సీతో కరచాలనం చేసే, ఫోటోలు దిగే అవకాశం లభిస్తుంది. అయితే, భద్రతా ప్రోటోకాల్ మరియు మెస్సీ బిజీ షెడ్యూల్ కారణంగా, ఈ ప్రత్యేక అవకాశానికి దాదాపు రూ. 10 లక్షలు (రూ. 9.95 లక్షలు + జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 13న మెస్సీ రాకతో హైదరాబాద్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *