మెక్సికో డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో హతం కావడంతో యుద్ధభూమిగా మారిన వీధులు

మెక్సికో డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో హతం కావడంతో యుద్ధభూమిగా మారిన వీధులు

మెక్సికో సైన్యం చేపట్టిన భారీ ఆపరేషన్‌లో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ తస్కరుడు నెమెసియో రూబెన్ ఒసెగ్యురా సెర్వాంటెస్ అలియాస్ ‘ఎల్ మెంచో’ హతమయ్యాడు. ఒకప్పుడు పోలీస్ అధికారిగా పనిచేసిన ఇతడు, జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తూ భయాందోళనలు సృష్టించాడు. ఇతడి మరణం మెక్సికో ప్రభుత్వానికి దక్కిన అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు.

అయితే ఎల్ మెంచో మరణవార్త తెలిసిన వెంటనే కార్టెల్ సభ్యులు మెక్సికో వ్యాప్తంగా హింసకు దిగారు. హైవేలను దిగ్బంధించి వాహనాలకు నిప్పు పెట్టడంతో గువాడలజారా వంటి నగరాలు అతలాకుతలమయ్యాయి. ఈ ఘర్షణల్లో పలువురు సైనికులు మరణించగా, సైన్యం భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం మెక్సికోలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *