ముక్కు నుండి రక్తం కారుతోందా కంగారు పడకుండా వెంటనే ఉపశమనం పొందేందుకు ఈ చిట్కాలు పాటించండి

ముక్కు నుండి రక్తం కారడం లేదా ఎపిస్టాక్సిస్ అనేది వాతావరణంలోని పొడిదనం లేదా ముక్కుకు తగిలే చిన్నపాటి గాయాల వల్ల కలిగే సాధారణ సమస్య. ముక్కులోని సున్నితమైన రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు ఇలా జరుగుతుంది. రక్తస్రావం మొదలైనప్పుడు ఆందోళన చెందకుండా, ముందుకు వంగి కూర్చుని బొటనవేలు మరియు చూపుడు వేలితో ముక్కు మెత్తని భాగాన్ని 5 నుండి 10 నిమిషాల పాటు గట్టిగా నొక్కి పట్టుకోవాలి. ఈ సమయంలో నోటితో శ్వాస తీసుకోవాలి. ఒకవేళ రక్తస్రావం 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
తక్షణ ఉపశమనం కోసం ముక్కుపై ఐస్ ముక్కలతో కోల్డ్ కంప్రెస్ చేయడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తస్రావం ఆగుతుంది. దీర్ఘకాలికంగా ఈ సమస్య నుండి బయటపడటానికి విటమిన్ C మరియు K పుష్కలంగా ఉండే ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం ద్వారా రక్తనాళాలు దృఢంగా మారుతాయి. శరీరంలో నీటిశాతం తగ్గకుండా తగినంత నీరు త్రాగడం వల్ల ముక్కు లోపలి పొరలు పొడిబారకుండా ఉంటాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా సెలైన్ వాటర్ ఉపయోగించడం ద్వారా కూడా ముక్కు నుండి రక్తం కారడాన్ని త్వరగా అదుపు చేయవచ్చు.