మీరు తెలియకుండానే మీ స్నేహితులకు భారమవుతున్నారా? ఈ అలవాట్లు మీలో ఉంటే వెంటనే మార్చుకోండి

మీరు తెలియకుండానే మీ స్నేహితులకు భారమవుతున్నారా? ఈ అలవాట్లు మీలో ఉంటే వెంటనే మార్చుకోండి

స్నేహం అంటే కేవలం కలిసి తిరగడం లేదా కష్టాల్లో తోడుండటం మాత్రమే కాదు, అవతలి వ్యక్తి వ్యక్తిత్వాన్ని మరియు వారి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడం కూడా. అయితే చాలామంది తాము చేసే పనులు ఎదుటివారిని ఇబ్బంది పెడుతున్నాయని గమనించరు. ఒకవేళ మీరు కూడా తెలియకుండానే ‘టాక్సిక్ ఫ్రెండ్’గా మారుతున్నారేమో ఈ చిన్న సంకేతాల ద్వారా తెలుసుకోండి.

ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో సరిచూసుకోండి

  • అతిగా నియంత్రించడం: మీ స్నేహితులు ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి అనేది మీరే నిర్ణయించాలని ప్రయత్నిస్తున్నారా? ఇది మీ స్నేహానికి ప్రమాదకరం.
  • ఎప్పుడూ మీ గురించే: సంభాషణలో కేవలం మీ సమస్యలు, మీ విజయాల గురిచే చెబుతూ.. అవతలి వారు చెప్పేది వినకపోవడం సరైన పద్ధతి కాదు.
  • చిన్నచూపు చూడటం: జోక్ చేస్తున్నాం కదా అని అందరి ముందు వారిని వెక్కిరించడం లేదా వారి ఆశయాలను తక్కువ చేసి మాట్లాడటం మానేయాలి.
  • అసూయ పడటం: మీ స్నేహితులు ఏదైనా సాధించినప్పుడు మనస్ఫూర్తిగా అభినందించలేకపోవడం టాక్సిక్ స్వభావానికి ప్రధాన సంకేతం.

మార్పు ఇలా మొదలుపెట్టండి

ఒకవేళ పైన చెప్పిన లక్షణాలు మీలో ఉన్నాయని అనిపిస్తే, ఆందోళన చెందకుండా ఈ క్రింది మార్పులు చేసుకోండి:

  • ఓపికగా వినడం నేర్చుకోండి: స్నేహితులు ఏదైనా చెబుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడకుండా పూర్తిగా వినండి. వారికి మీ సలహా కంటే ఓదార్పు లేదా తోడు అవసరం కావచ్చు.
  • వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించండి: స్నేహితులైనా సరే, ప్రతి ఒక్కరికీ కొంత ‘పర్సనల్ స్పేస్’ ఉంటుంది. వారి ఫోన్లు చెక్ చేయడం లేదా ప్రతి చిన్న విషయాన్ని నిలదీయడం ఆపేయండి.
  • క్షమాపణ చెప్పడానికి వెనకాడకండి: మీ ప్రవర్తన వల్ల వారు ఇబ్బంది పడితే, నిజాయితీగా క్షమాపణ చెప్పండి. ఇది మీ మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరుస్తుంది.

స్నేహం అనేది ఇద్దరి మధ్య ఉండే ఒక అందమైన వంతెన. అవతలి వ్యక్తి ఎదుగుదలను చూసి సంతోషించడం, వారిని గౌరవించడమే నిజమైన స్నేహం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *