మార్కెట్ చరిత్రలో ఎస్‌బీఐ సరికొత్త రికార్డు, రూ. 10 లక్షల కోట్ల క్లబ్‌లో చేరిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంక్

మార్కెట్ చరిత్రలో ఎస్‌బీఐ సరికొత్త రికార్డు, రూ. 10 లక్షల కోట్ల క్లబ్‌లో చేరిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంక్

భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) స్టాక్ మార్కెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. మార్కెట్ విలువలో రూ. 10 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించిన ఆరో భారతీయ కంపెనీగా ఎస్‌బీఐ నిలిచింది. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్ వంటి దిగ్గజాల సరసన ఇప్పుడు ఎస్‌బీఐ చేరింది. నిన్నటి ట్రేడింగ్‌లో ఎస్‌బీఐ షేరు ధర రికార్డు స్థాయిలో రూ. 1,154కు చేరుకోవడంతో ఈ ఘనత సాధ్యమైంది. గత ఏడాది కాలంలోనే ఈ బ్యాంక్ షేర్లు ఏకంగా 67.5 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.

ఈ అద్భుతమైన వృద్ధి వల్ల ఎస్‌బీఐలో భారీగా వాటాలు కలిగిన ఎల్ఐసీ (LIC) భారీ లాభాలను ఆర్జించింది. తాజా గణాంకాల ప్రకారం, ఎస్‌బీఐ షేర్ల పెరుగుదల వల్ల ఎల్ఐసీ సుమారు రూ. 40 వేల కోట్ల లాభాన్ని గడించింది. దేశంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ప్రస్తుతం ఎస్‌బీఐ ఆరో స్థానంలో కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ స్థాయి మార్కెట్ విలువను సాధించిన మొట్టమొదటి సంస్థగా ఎస్‌బీఐ నిలవడంతో అటు ఇన్వెస్టర్లలోనూ, ఇటు ఆర్థిక రంగంలోనూ హర్షం వ్యక్తమవుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *