మామగారి అంతిమ యాత్రలో కోడలి రీల్స్ విన్యాసం, నెటిజన్ల తీవ్ర ఆగ్రహం

న్యూస్ డెస్క్ : సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారని ఈ ఘటన నిరూపిస్తోంది. కన్న తండ్రి లాంటి మామగారు మరణించి, ఇంటి నిండా విషాదం నెలకొన్న వేళ, ఆ కోడలు మాత్రం మొబైల్ పట్టుకుని రీల్స్ చేస్తూ కనిపించింది. ఈ దృశ్యాలు చూసిన సామాన్య ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. కనీస మానవత్వం, సంస్కారం లేకుండా పోతున్న ఈ డిజిటల్ పిచ్చి సమాజంపై ఎంతటి దుష్ప్రభావాన్ని చూపుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో మామగారి పాడె తీస్తుంటే, ఆ మహిళ ఏడుస్తున్నట్లు నటిస్తూనే వీడియో రికార్డ్ చేస్తోంది. చుట్టుపక్కల ఉన్న మహిళలను కూడా బలవంతంగా తన వీడియోలోకి లాగడం అందరినీ విస్తుపోయేలా చేసింది. ఈ వీడియోను స్వయంగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మనిషి ప్రాణం కంటే సోషల్ మీడియా ప్రచారమే ముఖ్యమైపోయిన ఈ పరిస్థితి అత్యంత దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.