మహిళా డాక్టర్ హిజాబ్ లాగిన నితీష్ కుమార్ రాజకీయంగా వెల్లువెత్తుతున్న నిరసనలు

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పాట్నాలో ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలు అందజేసే క్రమంలో ఒక మహిళా డాక్టర్ హిజాబ్ లాగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఇక్రా హసన్ తీవ్రంగా స్పందిస్తూ ఇది మహిళల గౌరవంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఈ ప్రవర్తనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నితీష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్జేడీ పార్టీ ఈ ఘటనను ముఖ్యమంత్రి మానసిక స్థితికి అద్దం పడుతోందని విమర్శించింది. నితీష్ కుమార్ పూర్తిగా సంఘీలా మారిపోయారని ఆరోపించింది. వీడియోలో నితీష్ కుమార్ ఆ మహిళా డాక్టర్ హిజాబ్ సరిచేసే నెపంతో లాగడం స్పష్టంగా కనిపిస్తోంది. పక్కనే ఉన్న ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆయనను వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మహిళల పట్ల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.