మహిళల భద్రత కేసుల్లో తప్పుడు ఎఫ్ఐఆర్ లపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

మహిళల భద్రత కేసుల్లో తప్పుడు ఎఫ్ఐఆర్ లపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

మహిళల గౌరవానికి భంగం కలిగించే కేసుల్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మహిళలపై దాడి లేదా వేధింపులకు సంబంధించిన దాదాపు ప్రతి ఫిర్యాదులోనూ, బాధితులు చెప్పకపోయినప్పటికీ ‘చెయ్యి వేశారు’ వంటి పదాలను పోలీసులు ఉద్దేశపూర్వకంగా చేరుస్తున్నారని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ వ్యాఖ్యానించారు. ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని, దీనిపై అన్ని పోలీస్ స్టేషన్లలో ఆత్మపరిశీలన అవసరమని కోర్టు పేర్కొంది.

ఒక ఈవెంట్ మేనేజర్ దాఖలు చేసిన కేసులో ఇరువర్గాల మధ్య కుదిరిన రాజీని అంగీకరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్తులో బాధితులు చెప్పని విషయాలను ఫిర్యాదుల్లో బలవంతంగా చేర్చకుండా చూడాలని సంబంధిత డిసిపిని కోర్టు ఆదేశించింది. చట్టపరమైన ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, బాధితుల అసలు వాంగ్మూలానికి భిన్నంగా ఎలాంటి కల్పిత ఆరోపణలు ఉండకూడదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *