మహారాష్ట్ర క్రీడల మంత్రికి రెండేళ్ల జైలు శిక్ష మరియు అరెస్ట్ వారెంట్
December 18, 2025

ముఖ్యమంత్రి హౌసింగ్ స్కీమ్‌లో అక్రమాలకు పాల్పడిన కేసులో మహారాష్ట్ర క్రీడల మంత్రి మాణిక్‌రావు శివాజీరావు కోకాటేకు నాసిక్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఫోర్జరీ ద్వారా అనైతికంగా అనేక అపార్ట్‌మెంట్‌లను పొందినట్లు మంత్రిపై వచ్చిన ఆరోపణలు విచారణలో రుజువయ్యాయి.
శిక్ష ఖరారు కావడంతో కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మంగళవారం నాసిక్ జిల్లా కోర్టు వెలువరించిన ఈ సంచలన తీర్పు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అవినీతి కేసులో ప్రస్తుత మంత్రి దోషిగా తేలడం చర్చనీయాంశంగా మారింది.