మరణించే ముందు మెదడులో ఏం జరుగుతుంది? పరిశోధనలో షాకింగ్ నిజాలు వెల్లడి!

మరణానికి కొన్ని నిమిషాల ముందు మానవ మెదడులో ఏం జరుగుతుంది అనే రహస్యాన్ని ఇటీవలి ఒక పరిశోధన బయటపెట్టింది. చనిపోయే ముందు మెదడు తన జీవితంలోని మంచి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక 87 ఏళ్ల ఫిట్స్ రోగికి ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ (EEG) పరీక్ష జరుగుతున్నప్పుడు అతను గుండెపోటుతో మరణించాడు. ఆ సమయంలో అతని మెదడు కార్యకలాపాలు రికార్డు అయ్యాయి. మరణానికి ముందు 15 నిమిషాల పాటు అతని మెదడులో జరిగిన ఆలోచనలు ఈ రికార్డింగ్‌లో నమోదయ్యాయి.
ఈ రికార్డింగ్‌లో ‘గామా ఆసిలేషన్స్’ అనే ప్రత్యేక తరంగాలు కనిపించాయి. ఇవి సాధారణంగా జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు లేదా కలలు కంటున్నప్పుడు ఏర్పడతాయి. ఈ పరిశోధనను పర్యవేక్షించిన న్యూరోసర్జన్ డా. అజ్మల్ జెమ్మర్ ప్రకారం, చివరి క్షణాల్లో మెదడు చాలా వేగంగా పనిచేస్తూ, జీవితంలోని ఆనందకరమైన జ్ఞాపకాలను తిరిగి చూసుకుంటుంది. భారతదేశంలోని న్యూరాలజిస్టులు కూడా ఈ పరిశోధనతో ఏకీభవించారు, మరణించే సమయంలో మెదడులోని గామా, బీటా వంటి తరంగాలు అధికంగా చురుకుగా మారతాయని వారు తెలిపారు.