మదనపల్లె చిన్నారి హత్య కేసులో నేడు అంత్యక్రియలు.. ఆ సైకో కోసం పోలీసుల వేట ముమ్మరం
February 18, 2026

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సైకో కులవర్ధన్ చేతిలో దారుణ హత్యకు గురైన చిన్నారి అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. రాయచోటి మండలం దిండిమీదాగారి పల్లె గ్రామంలో కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలకనున్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరోవైపు ఈ అమానుషానికి ఒడిగట్టిన నిందితుడు కులవర్ధన్ కోసం పోలీసులు గాలింపు చర్యలను మరింత తీవ్రం చేశారు. నిన్నటి నుంచే ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నప్పటికీ నిందితుడి ఆచూకీ ఇంకా లభించలేదు. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఆ సైకోను వెంటనే ఎన్కౌంటర్ చేయాలంటూ మదనపల్లె వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో దర్యాప్తు చేస్తున్నారు.