భార్యతో మేనమామ అక్రమ సంబంధం! తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య

రాజస్థాన్‌లోని చురు జిల్లాలో భార్య మరియు తన మేనమామ మధ్య ఉన్న అక్రమ సంబంధం ఒక యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. పెళ్లయిన పది నెలలకే రతన్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బచ్రారా గ్రామంలో 26 ఏళ్ల యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. మరణానికి ముందు అతను చిత్రీకరించిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. వివాహమైన నాలుగు నెలలకే తన భార్య, ముగ్గురు పిల్లల తండ్రి అయిన తన మేనమామతో ప్రేమలో పడిందని, వారి ప్రవర్తన వల్ల తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
కుటుంబానికి ఏకైక ఆధారమైన ఆ యువకుడు ఆత్మహత్యకు ముందు తన భార్య మరియు మేనమామకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను కోరాడు. గతంలోనే అతని తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మొదట సాధారణ మరణంగా భావించిన పోలీసులు, ఇప్పుడు ఆ వీడియో ఆధారంగా కేసును రీ-ఓపెన్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు వేగవంతం చేశారు.