భారత రాజ్యాంగాన్ని గౌరవించలేకపోతే దేశం విడిచి వెళ్లండి వాట్సాప్ మరియు మెటాకు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్

భారత రాజ్యాంగాన్ని గౌరవించలేకపోతే దేశం విడిచి వెళ్లండి వాట్సాప్ మరియు మెటాకు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్

న్యూస్ డెస్క్ : మీ వ్యక్తిగత సమాచారం వాట్సాప్‌లో సురక్షితంగా ఉందా? డేటా ప్రైవసీ విషయంలో మెటా సంస్థపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత రాజ్యాంగాన్ని, ఇక్కడి చట్టాలను పాటించలేకపోతే దేశం విడిచి వెళ్లవచ్చని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పౌరుల వ్యక్తిగత గోప్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని కోర్టు తేల్చి చెప్పింది.

వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల సమాచారాన్ని ఇతర ప్లాట్‌ఫారమ్‌లతో పంచుకోవద్దని కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సామాన్య ప్రజలకు అర్థం కాని సంక్లిష్టమైన పాలసీలతో వారిని ఇబ్బంది పెట్టడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. డేటా ప్రైవసీపై పూర్తి నివేదిక సమర్పించాలని, అంతవరకు యూజర్ల సమాచారాన్ని షేర్ చేయకూడదని ఆదేశించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *