భారత్ వాణిజ్య దెబ్బకు కుదేలవుతున్న బంగ్లాదేశ్ జూట్ పరిశ్రమ
December 31, 2025

భారత్‌కు ముడి జనపనార ఎగుమతులను బంగ్లాదేశ్ నిలిపివేయడంతో, అక్కడి నుంచి వచ్చే జూట్ ఉత్పత్తులపై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. అతి తక్కువ ధరలకే ఉత్పత్తులను భారత మార్కెట్లో కుమ్మరించి, ఇక్కడి పరిశ్రమలను దెబ్బతీసేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నించడమే ఇందుకు ప్రధాన కారణం. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన జూట్ పరిశ్రమ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
నాణ్యమైన జూట్ విత్తనాల కోసం భారత్‌పైనే ఆధారపడుతున్న బంగ్లాదేశ్, ఇప్పుడు వాణిజ్య పరంగా భారత్‌తో తలపడి భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. దీనివల్ల భారతీయ మిల్లుల్లో ఉత్పత్తి ఖర్చు పెరిగినప్పటికీ, స్వయం సమృద్ధి దిశగా భారత్ అడుగులు వేస్తోంది. సబ్సిడీలు మరియు ఎగుమతి ప్రోత్సాహకాలతో భారత్‌ను ఎదుర్కోవాలనుకున్న బంగ్లాదేశ్ వ్యూహం ఇప్పుడు ఆ దేశానికే పెను శాపంగా మారింది.