భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య నేడే ఆఖరి పోరు విజేత ఎవరో తెలుసుకోవాలని ఉందా
December 19, 2025

భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆఖరి సమరం నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌కు 6:30 గంటలకు టాస్ వేస్తారు. అంతకుముందు లక్నోలో జరగాల్సిన నాలుగో మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దు కావడంతో, ఈ చివరి మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ మ్యాచ్‌ను ప్రేక్షకులు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ కీలక పోరులో టీమ్ ఇండియా తన సత్తా చాటుతుందో లేదో వేచి చూడాలి.