భారత్‌లోకి అక్రమంగా చొరబడి సరిహద్దు వీడియోలు తీసిన చైనా పౌరుడు అరెస్ట్!

భారత్‌లోకి అక్రమంగా చొరబడి సరిహద్దు వీడియోలు తీసిన చైనా పౌరుడు అరెస్ట్!

ఉత్తరప్రదేశ్‌లోని భారత్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. సరైన పత్రాలు లేకుండా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి, సున్నిత సరిహద్దు ప్రాంతాన్ని వీడియో తీస్తున్న చైనాకు చెందిన 49 ఏళ్ల లియూ కున్‌జింగ్‌ను సహస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) దళాలు అరెస్ట్ చేశాయి. బహ్రైచ్ జిల్లాలోని రూపైదియా వద్ద అక్రమంగా సరిహద్దు దాటుతున్నప్పుడు గస్తీ బృందాలు అతడిని పట్టుకున్నట్లు ఎస్‌ఎస్‌బీ అధికారులు తెలిపారు.

అతడిని ఇంటర్‌ప్రెటర్ సహాయంతో ప్రశ్నిస్తున్నారు. నిందితుడి వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్‌లు, పాకిస్థాన్‌తో సహా ఇతర దేశాల కరెన్సీ, అలాగే పాకిస్థాన్ వీసా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అతని ఫోన్లలో సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు ఉండటంతో భద్రతా ఉల్లంఘనపై దర్యాప్తు జరుగుతోంది. ఈ అక్రమ చొరబాటు వెనుక గూఢచర్యం కోణాన్ని నిగ్గు తేల్చేందుకు భద్రతా, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంయుక్త దర్యాప్తు ప్రారంభించాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *