ఎల్ఐసి బంపర్ ఆఫర్ రోజుకు 45 రూపాయల పొదుపుతో 25 లక్షలు మీ సొంతం

భారతీయ జీవిత బీమా సంస్థ అందిస్తున్న ‘జీవన ఆనంద్’ పాలసీ పొదుపుతో పాటు భద్రతను కోరుకునే వారికి గొప్ప వరం. 18 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పథకంలో చేరవచ్చు. ఉదాహరణకు, 35 ఏళ్ల వ్యక్తి 35 ఏళ్ల కాలపరిమితితో 5 లక్షల బీమా తీసుకుంటే, నెలకు కేవలం 1400 రూపాయలు లేదా రోజుకు సుమారు 45 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. పాలసీ కాలపరిమితి ముగిశాక మెచ్యూరిటీ మొత్తంగా సుమారు 25 లక్షల రూపాయలు అందుకోవచ్చు. దీనితో పాటు ఆదాయపు పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.
ఈ పాలసీలోని ప్రధాన ఆకర్షణ ‘హోల్ లైఫ్ కవరేజ్’. సాధారణంగా బీమా పాలసీలు మెచ్యూరిటీ తర్వాత ముగిసిపోతాయి, కానీ జీవన ఆనంద్ పథకంలో మెచ్యూరిటీ డబ్బులు తీసుకున్న తర్వాత కూడా జీవితాంతం బీమా రక్షణ కొనసాగుతుంది. పాలసీదారుడి మరణానంతరం నామినీకి అదనపు బీమా మొత్తం అందుతుంది. పాలసీ ప్రారంభించిన రెండేళ్ల తర్వాత లోన్ తీసుకునే సదుపాయం కూడా కలదు. మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ఈ ప్లాన్ రూపొందించబడింది.