భారతీయుల సత్తా చూసి ఫిదా అయిన ఫ్రాన్స్ అధ్యక్షుడు.. ముంబై వేదికగా ప్రధాని మోదీ ముందే ఆసక్తికర వ్యాఖ్యలు

భారతీయుల సత్తా చూసి ఫిదా అయిన ఫ్రాన్స్ అధ్యక్షుడు.. ముంబై వేదికగా ప్రధాని మోదీ ముందే ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచ వేదికపై భారతీయులు తమ జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ ప్రపంచం వరకు ప్రతి రంగంలోనూ మనవాళ్లే బాస్ అనిపించుకుంటున్నారు. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మెక్రాన్ భారతీయ ప్రతిభను ఆకాశానికెత్తారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలన్నీ భారతీయుల చేతుల్లోనే ఉన్నాయని ఆయన కొనియాడారు. ముఖ్యంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వంటి దిగ్గజాల పేర్లను ప్రస్తావిస్తూనే.. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన లీనా నాయర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ ‘షానెల్’ సీఈవోగా లీనా నాయర్ బాధ్యతలు నిర్వహించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. “భారత్ కేవలం ఆవిష్కరణల్లో భాగస్వామి మాత్రమే కాదు.. నేడు ప్రపంచానికే నాయకత్వం వహిస్తోంది” అంటూ మెక్రాన్ ప్రశంసలు కురిపించినప్పుడు, వేదికపై ఉన్న ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ ముఖాల్లో గర్వంతో కూడిన చిరునవ్వు కనిపించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *