బ్రెజిల్‌లో రికార్డు స్థాయి వర్షాల బీభత్సం కారణంగా 14 మంది మృతి

బ్రెజిల్‌లో రికార్డు స్థాయి వర్షాల బీభత్సం కారణంగా 14 మంది మృతి

బ్రెజిల్‌లోని ఆగ్నేయ నగరమైన జుయిజ్ డి ఫోరాలో కురిసిన భారీ వర్షాల వల్ల 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన ఈ వానల వల్ల 440 మంది నిరాశ్రయులయ్యారు. ఫిబ్రవరి నెలలో సాధారణం కంటే రెట్టింపు వర్షపాతం నమోదు కావడంతో స్థానిక యంత్రాంగం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో విద్యాసంస్థలను మూసివేశారు. గాలింపు చర్యల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రియో డి జనీరో సహా 14 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *