బ్రతికున్న వ్యక్తిని చనిపోయినట్లు ప్రకటించిన డాక్టర్లు పోస్టుమార్టం గదిలో బయటపడ్డ అసలు నిజం

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లాలా లజపత్ రాయ్ ఆసుపత్రిలో బ్రతికున్న రోగిని చనిపోయినట్లు ప్రకటించి పోస్టుమార్టంకు సిద్ధం చేసిన ఘటన కలకలం రేపింది. వార్డులో చికిత్స పొందుతున్న వినోద్ అనే వ్యక్తి ఫైల్‌పై జూనియర్ డాక్టర్ పొరపాటున సంతకం చేయడంతో ఈ దారుణం జరిగింది. సాయంత్రం పోలీసులు మృతదేహాన్ని తరలించేందుకు రాగా, వినోద్ ప్రాణాలతో ఉండటం చూసి విస్తుపోయారు. పక్క బెడ్లో ఉన్న గుర్తుతెలియని వృద్ధుడు మరణించగా, వైద్యుల నిర్లక్ష్యం వల్ల వినోద్‌ను మృతుడిగా రికార్డుల్లో నమోదు చేశారు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆసుపత్రి యాజమాన్యం ఒక జూనియర్ డాక్టర్ మరియు నర్సుతో సహా ముగ్గురిని సస్పెండ్ చేసింది. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సంజయ్ కాలా దీనిపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించి 48 గంటల్లో నివేదిక కోరారు. ప్రస్తుతం వినోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరణించిన వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. తన కొడుకు బ్రతికే ఉన్నాడని తెలిసి కూడా వినోద్ కుటుంబ సభ్యులు అతడిని ఇంటికి తీసుకెళ్లేందుకు నిరాకరించడం గమనార్హం.