బ్రతికున్న కూతురికి పిండ ప్రధానం చేసిన తల్లిదండ్రులు ప్రేమ పెళ్లిపై ఆగ్రహంతో దారుణం
December 17, 2025

ఉత్తర దినాజ్పూర్ జిల్లా చోప్రా ప్రాంతంలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఆగ్రహించిన తల్లిదండ్రులు, బ్రతికున్న తమ కూతురికి అంత్యక్రియలు నిర్వహించి పిండ ప్రధానం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా కూతురు ఇంటికి తిరిగి రావడానికి నిరాకరించడంతో, ఆమె తమకు చనిపోయిందని భావిస్తూ వారు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో బంధువులతో పాటు గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. సాధారణంగా చనిపోయిన పూర్వీకుల కోసం చేసే ఈ ‘శ్రాద్ధ’ కర్మను, తమ కూతురితో బంధం తెంచుకోవడానికి ప్రతీకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.