బీజేపీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ ఎంపిక వెనుక రహస్యం ఏమిటి?

బీజేపీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ ఎంపిక వెనుక రహస్యం ఏమిటి?

సంస్థాగత బలం మరియు తదుపరి తరా నికి బాధ్యతలు అప్పగిం చే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటుగా నితిన్ నవీన్ నియమితులయ్యారు. 45 ఏళ్ల నవీన్, బీజేపీలో అతి చిన్న వయస్కుడైన వర్కింగ్ ప్రెసిడెంట్. దాదాపు రెండు దశాబ్దాల సంస్థాగత అనుభవం మరియు క్షేత్రస్థాయిలో పని తీరు కారణంగా పార్టీ అధిష్టానం ఆయనపై విశ్వాసం ఉంచింది. ఆయన సంస్థాగత పట్టు, నాయకత్వంతో సమన్వయం మరియు కఠినమైన రాజకీయ పనులను విజయవంతంగా పూర్తి చేయగల సామర్థ్యం అనే మూడు అంశాలు ఆయనకు అనుకూలంగా మారినట్టు సమాచారం.

నవీన్ ‘కష్టపడే తత్వం’, ‘రాజకీయ జిజ్ఞాస’ మరియు ‘సమన్వయం’ గల వ్యక్తిగా పార్టీలో గుర్తింపు పొందారు. బీహార్ యూత్ వింగ్ నుంచి ఎదిగిన ఆయన, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి పార్టీ దృష్టిని ఆకర్షించారు. తూర్పు భారతదేశంలోని బీహార్ నుండి ఈ పదవిని పొందిన మొదటి వ్యక్తిగా ఆయన నియామకం, సంస్థాగత విస్తరణపై బీజేపీకున్న ఆసక్తిని, రాబోయే ఎన్నికల కోసం పార్టీని పటిష్టం చేయాలనే లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *