బాబాయ్ నన్ను కాపాడండి నేను చనిపోవాలనుకోవడం లేదు పరీక్షల ముందు విద్యార్థి ఆత్మహత్య
February 1, 2026

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా రాణితాల్ గ్రామంలో 11వ తరగతి చదువుతున్న అర్మాన్ సింగ్ అనే విద్యార్థి విషం తాగి ప్రాణాలు విడిచాడు. ఫిబ్రవరి 10 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న తరుణంలో, తెల్లవారుజామున తన బాబాయ్ వద్దకు వెళ్లి తను విషం తాగానని కాపాడమని వేడుకున్నాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మరణించాడు.
చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అర్మాన్‌ను అతని తల్లి ఎంతో కష్టపడి పెంచింది. చదువులో రాణిస్తున్న కుమారుడి మరణంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషించేందుకు పోలీసులు అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.