బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత: భారత రాయబార కార్యాలయంపై దాడి, వీసా సేవలు నిలిపివేత!

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత: భారత రాయబార కార్యాలయంపై దాడి, వీసా సేవలు నిలిపివేత!

విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతితో బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. చిట్టగాంగ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషన్‌పై ఆందోళనకారులు రాళ్లు రువ్వి దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. డాకా, రాజ్‌షాహీ ప్రాంతాల్లోనూ భారత్ వ్యతిరేక నినాదాలతో నిరసనలు వెల్లువెత్తడంతో భారత దౌత్య కార్యాలయాల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

భద్రతా కారణాల దృష్ట్యా చిట్టగాంగ్‌లోని భారత వీసా దరఖాస్తు కేంద్రం (IVAC) కార్యకలాపాలను ఆదివారం నుండి నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ కేంద్రం మూసివేయబడుతుంది. పరిస్థితిని గమనిస్తూ రాజ్‌షాహీ, ఖుల్నాలోని భారత కేంద్రాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *