ఫ్రిజ్‌లో పెట్టిన నిల్వ ఆహారం తిన్న యువకుడికి ఘోర పరిస్థితి రెండు కాళ్లు మరియు వేళ్లు తొలగింపు

ఫ్రిజ్‌లో పెట్టిన నిల్వ ఆహారం తిన్న యువకుడికి ఘోర పరిస్థితి రెండు కాళ్లు మరియు వేళ్లు తొలగింపు

ఇంగ్లాండ్‌కు చెందిన జేసీ అనే యువకుడు రాత్రి హోటల్ నుండి తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టిన నూడుల్స్, చికెన్‌ను మరుసటి రోజు ఉదయం తిన్నాడు. అది తిన్న వెంటనే అతడు తీవ్ర జ్వరం బారిన పడటమే కాకుండా శరీరం రంగు మారిపోయింది. ఆసుపత్రికి తరలించగా, ఆహారంలోని బ్యాక్టీరియా వల్ల అతడికి ‘సెప్సిస్’ సోకిందని, కిడ్నీలు విఫలమయ్యాయని వైద్యులు గుర్తించారు. ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు పాకకుండా ఉండేందుకు వైద్యులు అతడి రెండు కాళ్లను, చేతి వేళ్లను తొలగించాల్సి వచ్చింది.

సెప్సిస్ అనేది ప్రాణాంతకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇది శరీర నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సుమారు 26 రోజుల పాటు కోమాలో ఉన్న జేసీ ప్రాణాలతో బయటపడినప్పటికీ, జీవితాంతం వికలాంగుడిగా మారిపోయాడు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడూ తాజా ఆహారాన్నే తీసుకోవాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది. స్వల్ప అజాగ్రత్త ప్రాణాల మీదకు వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *