ఫామ్ కోసం తంటాలు పడుతున్న అభిషేక్ శర్మకు టీమ్ బస్సులోనే క్లాస్ పీకిన కోచ్ గౌతమ్ గంభీర్
February 24, 2026

వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయి, దక్షిణాఫ్రికాపై కూడా విఫలమైన యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై కోచ్ గౌతమ్ గంభీర్ ప్రత్యేక దృష్టి సారించారు. తదుపరి జింబాబ్వే మ్యాచ్ కోసం ప్రయాణిస్తున్న సమయంలో టీమ్ బస్సులోనే అభిషేక్‌కు గంభీర్ సీరియస్‌గా సూచనలు ఇస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ వెలుపల వచ్చే బంతులను ఎదుర్కోవడంలో అభిషేక్ పడుతున్న ఇబ్బందులను గంభీర్ వివరిస్తున్నారు.
బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్ కూడా అభిషేక్ ఫామ్ పై కసరత్తులు చేస్తున్నారు. బహిరంగంగా ఇలా చర్చించడంపై కొందరు అభిమానులు పెదవి విరుస్తున్నా, జట్టు ప్రయోజనాల దృష్ట్యా గంభీర్ తీసుకుంటున్న చర్యలు కీలకంగా మారాయి. టీమ్ ఇండియా మళ్లీ విజయాల బాట పట్టాలంటే ఓపెనర్ గా అభిషేక్ రాణించడం ఇప్పుడు అత్యవసరం.