జార్ఖండ్ అడవుల్లో కూలిన ఎయిర్ అంబులెన్స్ ప్రయాణిస్తున్న ఏడుగురు దుర్మరణం

జార్ఖండ్ అడవుల్లో కూలిన ఎయిర్ అంబులెన్స్ ప్రయాణిస్తున్న ఏడుగురు దుర్మరణం

రాంచీ నుండి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో కూలిపోవడంతో విమానంలో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తీవ్రంగా గాయపడిన రోగి, అతని భార్య మరియు వైద్య సిబ్బంది ఉన్నారు. సాయంత్రం 7:11 గంటలకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వాతావరణం అనుకూలించక కోల్‌కతా ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. వారణాసి సమీపంలో రాడార్ నుండి అదృశ్యమైన ఈ విమానం దట్టమైన అడవిలో పడిపోయింది.

అడవిలో రహదారి సౌకర్యం లేకపోవడంతో ఎస్ఎస్‌బీ సిబ్బంది మృతదేహాలను మోస్తూ సుమారు రెండు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. రోగి చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఎనిమిది లక్షల రూపాయలు అప్పు చేసి ఈ ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కేంద్ర విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (AAIB) రెడ్ బర్డ్ ఏవియేషన్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టి ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ ప్రారంభించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *