ప్రకటనలు చూసి మోసపోతున్నారా? తెల్లబడతామనే వాగ్దానాలతో జాగ్రత్త
February 3, 2026

ఏక్ జలక్ న్యూస్ డెస్క్ : కేవలం మూడు వారాల్లో క్రీమ్ రాస్తే తెల్లగా అయిపోతారా? ఢిల్లీకి చెందిన నిఖిల్ జైన్ ‘ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్’ ప్రకటనను నమ్మి కొన్నారు, కానీ ఫలితం లేకపోవడంతో ఆ కంపెనీపైనే పోరాటానికి దిగారు. సామాన్య ప్రజలను ఆకర్షించేందుకు కంపెనీలు చేసే తప్పుడు ప్రచారాలు వినియోగదారులను ఎలా ఇబ్బందుల్లోకి నెడతాయో ఈ ఘటన అద్దం పడుతోంది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకు ఇమామి కంపెనీకి వినియోగదారుల ఫోరమ్ ₹15 లక్షల జరిమానా విధించింది. అసంపూర్ణ సమాచారంతో వినియోగదారులను మోసం చేయడం సరైన పద్ధతి కాదని కోర్టు తేల్చిచెప్పింది. బాధితుడికి ₹60,000 పరిహారం చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది. ప్రకటనల మాయలో పడకుండా వినియోగదారులు తమ హక్కుల కోసం పోరాడాలని ఈ తీర్పు సూచిస్తోంది.