పొగరాయుళ్లకు చుక్కలు చూపిస్తున్న ఐటీసీ.. ఒక్కో సిగరెట్‌పై భారీగా పెరిగిన ధరలు

పొగరాయుళ్లకు చుక్కలు చూపిస్తున్న ఐటీసీ.. ఒక్కో సిగరెట్‌పై భారీగా పెరిగిన ధరలు

సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్ ఇస్తూ ఐటీసీ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సిగరెట్ ధరలను భారీగా పెంచుతూ కొత్త ధరల పట్టికను విడుదల చేసింది. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఎక్సైజ్ డ్యూటీలు, జీఎస్‌టీ రేట్ల నేపథ్యంలో ఈ పెంపు అనివార్యమైంది. బ్రాండ్‌ను బట్టి 19 శాతం నుండి ఏకంగా 41 శాతం వరకు ధరలు పెరగడం గమనార్హం.

బ్రాండ్ల వారీగా పెరిగిన ధరల వివరాలు

ప్రముఖ బ్రాండ్లు అయిన గోల్డ్ ప్లేక్, క్లాసిక్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

  • గోల్డ్ ప్లేక్ (10 సిగరెట్ల ప్యాక్): గతంలో రూ. 170 ఉండగా, ఇప్పుడు రూ. 240కి చేరింది. అంటే ప్యాకెట్‌పై రూ. 70 పెరిగింది. ఒక్కో సిగరెట్ ధర ఇప్పుడు రూ. 24.
  • క్లాసిక్ వేరియంట్ (20 పీస్ ప్యాక్): రూ. 340 నుంచి ఏకంగా రూ. 480కి పెరిగింది. ప్యాకెట్‌పై రూ. 140 భారం పడింది.
  • సూపర్ స్టార్ వాల్యూ (10 సిగరెట్ల ప్యాక్): రూ. 59 నుంచి రూ. 70కి పెరిగింది.

ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు

కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై నియంత్రణలో భాగంగా జీఎస్‌టీ మరియు ఎక్సైజ్ సుంకాన్ని సవరించింది. పాన్ మసాలాపై 40 శాతం జీఎస్‌టీతో పాటు అదనపు సెస్ విధించారు. సిన్ గూడ్స్ కేటగిరీలో ఉన్న సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం ఒక్కో స్టిక్‌కు రూ. 2 నుండి రూ. 11 వరకు పెరగడంతో ఐటీసీతో పాటు గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా వంటి ఇతర కంపెనీలు కూడా ధరలను పెంచేశాయి.

గతంలో ధరలు పెరిగినప్పుడు రూపాయి లేదా రెండు రూపాయలు మాత్రమే వ్యత్యాసం ఉండేదని, కానీ ఇప్పుడు ఒక్కో సిగరెట్‌పై రూ. 5 నుంచి రూ. 7 వరకు పెరగడం ఇదే తొలిసారి అని వ్యాపారులు చెబుతున్నారు. అటు జేబులు ఖాళీ అవుతున్నా, ఇటు అలవాటు మానలేక స్మోకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *