పెళ్లి కావడం లేదని బాలికపై ఘాతుకం నిందితుడి దారుణ చర్య
December 17, 2025

బీహార్‌లోని రోహతాస్ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 40 ఏళ్ల ఉపేంద్ర రామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు వివాహం కావడం లేదనే కారణంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. తనను ఎక్కడ గుర్తిస్తుందోనన్న భయంతోనే బాలికను గొంతు నులిమి చంపినట్లు తెలిపాడు.
కోచింగ్ ముగించుకుని ఇంటికి వస్తున్న బాలిక మృతదేహం డ్రైనేజీ వద్ద లభ్యమైంది. నిందితుడి ముఖంపై ఉన్న గోరు గీతలు మరియు ఇంట్లో లభించిన రక్తపు మరకల ఆధారంగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.