పెళ్లికి ఆలస్యంగా వచ్చిన వరుడు; కోపంతో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న వధువు

పెళ్లికి ఆలస్యంగా వచ్చిన వరుడు; కోపంతో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న వధువు

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని మల్కాపూర్ పాంగ్రా గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకలో నాటకీయ ఘటన జరిగింది. ఏప్రిల్ 22న సాయంత్రం 4 గంటలకు పెళ్లికి శుభ ముహూర్తం నిర్ణయించబడింది, కానీ వరుడు సమయానికి వేదిక వద్దకు రాలేదు. సాయంత్రం గడిచి రాత్రి 8 గంటలైనా వరుడు కనిపించలేదు, అతను స్నేహితులతో మద్యం తాగి, డ్యాన్స్ చేయడంలో బిజీగా ఉన్నట్లు తెలిసింది. గంటల తరబడి వేచి చూసిన వధువు, వరుడి నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం చెంది కీలక నిర్ణయం తీసుకుంది.

ఆలస్యంగా వచ్చిన, మద్యం సేవించిన వరుడిని తిరస్కరించిన వధువు, తన కుటుంబ సభ్యుల మద్దతుతో, అక్కడే ఉన్న బంధువులలో ఒక యువకుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అసలు వరుడి ఆలస్యం కారణంగా, అదే వివాహ వేదికలో ఆ బంధువుతో వధువుకు వివాహం జరిపించారు. రాత్రి 8 గంటలకు తాగి మండపం వద్దకు వచ్చిన వరుడు, తన వధువు మరొకరిని పెళ్లి చేసుకోవడం చూసి నిశ్చేష్టుడై తల పట్టుకుని కూర్చుండిపోయాడు. ఈ సంఘటన ఆ ప్రాంతం మొత్తంలో చర్చనీయాంశంగా మారింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *