పెన్షనర్లకు భారీ ముప్పు మీ ఖాతాలోని సొమ్ము ఖాళీ చేసే కొత్త మోసం

పెన్షనర్లకు భారీ ముప్పు మీ ఖాతాలోని సొమ్ము ఖాళీ చేసే కొత్త మోసం

దేశవ్యాప్తంగా పెన్షన్ పొందుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని ‘పెన్షనర్ కార్డ్’ పేరుతో కొత్త రకం సైబర్ మోసాలు జరుగుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ విషయమై ఖాతాదారులను హెచ్చరిస్తూ, వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని కోరింది. బ్యాంక్ అధికారులమని నమ్మిస్తూ ఓటీపీ లేదా వ్యక్తిగత వివరాలను సేకరించి అకౌంట్లను ఖాళీ చేస్తున్నట్లు గుర్తించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ పిన్ లేదా ఓటీపీ వివరాలను ఎవరికీ వెల్లడించకండి. కొత్త పెన్షనర్ కార్డ్ లేదా ఇతర సేవల కోసం నేరుగా బ్యాంకు శాఖను సంప్రదించడం శ్రేయస్కరం. గుర్తుతెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం లేదా లింక్‌లపై క్లిక్ చేయడం వల్ల మీ ఆర్థిక భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది, కాబట్టి అప్రమత్తంగా ఉండండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *