పుట్టిన వెంటనే తల్లిని పిల్ల తేళ్లు తినేస్తాయా ఈ వింత ప్రచారం వెనుక అసలు నిజాలివే

పుట్టిన వెంటనే తల్లిని పిల్ల తేళ్లు తినేస్తాయా ఈ వింత ప్రచారం వెనుక అసలు నిజాలివే

తేలు పిల్లలు పుట్టిన వెంటనే తమ తల్లిని ఆహారంగా తీసుకుంటాయనే ప్రచారం సమాజంలో బలంగా ఉంది. అయితే ఇది కేవలం ఒక అపోహ మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆడ తేలు గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలకు జన్మనిస్తుంది. పుట్టినప్పుడు అత్యంత సున్నితంగా ఉండే ఈ పిల్లలు రక్షణ కోసం దాదాపు 10 నుండి 20 రోజుల పాటు తల్లి వీపుపైనే నివసిస్తాయి.

అరిజోనా స్టేట్ యూనివర్శిటీ పరిశోధనల ప్రకారం పిల్లలు తల్లిని వేటాడటం చాలా అరుదు. వాస్తవానికి తల్లి తేలు తన సంతానంలో బలహీనంగా ఉన్న పిల్లలను తింటుంది. తద్వారా మిగిలిన బలమైన పిల్లలకు సరైన పోషణ మరియు రక్షణ లభిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. కొన్ని రకాల సాలెపురుగులలో కనిపించే ఈ లక్షణం తేళ్ల విషయంలో నిజం కాదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *