పార్లమెంట్ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడానికి రాహుల్ గాంధీ సాకులు వెతుకుతున్నారని ధర్మేంద్ర ప్రధాన్ ధ్వజం

పార్లమెంట్ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడానికి రాహుల్ గాంధీ సాకులు వెతుకుతున్నారని ధర్మేంద్ర ప్రధాన్ ధ్వజం

బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ కార్యకలాపాలను పదేపదే అడ్డుకుంటున్నారని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విరుచుకుపడ్డారు. రాహుల్‌ను ‘బయాన్ బహదూర్’ అని అభివర్ణిస్తూ, సభను స్తంభింపజేయడానికి ఆయన నిత్యం కొత్త సాకులు వెతుకుతున్నారని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా అరాచక మార్గాన్ని ఎంచుకున్నారని ప్రధాన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ సంస్థలపై దాడి చేస్తోందని, దేశ ప్రగతిని చూసి వారు ఓర్వలేకపోతున్నారని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *