పని ఒత్తిడితో ప్రాణం పోయిన వేళ మరణించిన 8 గంటల తర్వాత కొత్త పని అప్పగించిన ఆఫీస్

పని ఒత్తిడితో ప్రాణం పోయిన వేళ మరణించిన 8 గంటల తర్వాత కొత్త పని అప్పగించిన ఆఫీస్

పని ఒత్తిడి తట్టుకోలేక చైనాకు చెందిన 32 ఏళ్ల ప్రోగ్రామర్ గుండెపోటుతో మరణించిన ఘటన కార్పొరేట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 2021లో ప్రమోషన్ వచ్చినప్పటి నుండి అతను ప్రతిరోజూ రాత్రి 9:30 గంటల తర్వాతే ఇంటికి వచ్చేవాడని అతని భార్య పేర్కొన్నారు. మరణించిన రోజు ఉదయం ఆరోగ్యం సహకరించకపోయినా, ఆఫీస్ పని ఒత్తిడి కారణంగా ఆయన విశ్రాంతి తీసుకోలేకపోయారు.

అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, అతను మరణించిన కేవలం ఎనిమిది గంటల తర్వాత ఆఫీస్ నుండి మరో కొత్త పని కోసం మెయిల్ వచ్చింది. అతను ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో కూడా ఆఫీస్ చాట్ గ్రూపుల్లో యాడ్ చేయడం గమనార్హం. మానవత్వం లేని ఈ పని సంస్కృతిపై ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *