నేపాల్‌లో తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కికి Gen-Z వర్గం నుండి కొత్త సవాల్!
September 16, 2025

నేపాల్‌లో కె.పి. శర్మా ఓలీ ప్రభుత్వాన్ని పడగొట్టిన Gen-Z బృందం, ఇప్పుడు తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మంత్రివర్గాన్ని ఏకపక్షంగా ఎంపిక చేశారని ఆరోపిస్తూ ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా హోం మంత్రిగా ఓం ప్రకాష్ ఆర్యల్‌ను నియమించడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఇంత కీలకమైన పదవికి ‘బయటి’ వ్యక్తిని ఎందుకు నియమించారని నిరసనకారులు ప్రశ్నిస్తున్నారు. Gen-Z నాయకుడు సుదన్ గురుంగ్, కర్కికి గట్టి హెచ్చరిక జారీ చేస్తూ, “మిమ్మల్ని ప్రధానమంత్రిని చేయగలిగినప్పుడు, మిమ్మల్ని, మీ నాయకులను పదవి నుండి తొలగించడానికి ఎక్కువ సమయం పట్టదు” అని స్పష్టం చేశారు.