నేడు పార్లమెంటులో ‘వందే మాతరం’పై 10 గంటల చర్చ ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు

నేడు పార్లమెంటులో ‘వందే మాతరం’పై 10 గంటల చర్చ ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు

జాతీయ గీతం ‘వందే మాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా నేడు పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ చారిత్రక చర్చను ప్రారంభిస్తారు. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చను మొదలుపెడతారు. గీతం యొక్క చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత మరియు స్వాతంత్ర్య పోరాటంలో దాని పాత్రపై మొత్తం 10 గంటల పాటు చర్చ జరగనుంది.

లోక్‌సభ చర్చలో కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ పాల్గొనగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే భాగం పంచుకుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌ను కూడా విడుదల చేసింది. ఈ ప్రత్యేక చర్చ సందర్భంగా పార్లమెంటులో వాడివేడి చర్చలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *